ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుద్రహోమంతో ముగిసిన దుర్గమ్మ వసంత నవరాత్రి ఉత్సవాలు - Durgamma Vasantha Navratri festivities news

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. జగజ్జననీ.. దుర్గమ్మ వసంత నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతి, రుద్రహోమంతో పరిసమాప్తం అయ్యాయి.

durgamma vasanta navaratri festives
దుర్గమ్మ వసంత నవరాత్రి మహోత్సవాలు

By

Published : Apr 22, 2021, 9:49 PM IST

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వసంత నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించారు. ఈ రోజు పూర్ణాహుతి, రుద్రహోమంతో ఉత్సవాలు ముగిశాయి. విశేషమైన పుష్పార్చనలు, మూల మంత్ర హవనాలు, త్రికాలమంటప పూజలు నిర్వహించారు. ఈ పూజలు పూర్ణఫలాన్ని ఇవ్వడం కోసం మహాపూర్ణాహుతి జరిపారు. అగ్నిముఖంగా చేసే మంత్రాలతో ప్రతి క్రతువు దేవదూత రూపంలో అమ్మవారికి సమర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాదశర్మ తెలిపారు. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని, అమ్మవారి అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details