ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్గామల్లేశ్వర కల్యాణానికి ఇంద్రకీలాద్రి ముస్తాబు

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు విజయవాడలో కనకదుర్గమ్మ, పరమేశ్వరుల కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుక కోసం ఇంద్రకీలాద్రి అందంగా ముస్తాబైంది.

durga-temple-marriage

By

Published : Apr 17, 2019, 6:08 PM IST

దుర్గామల్లేశ్వర కల్యాణానికి ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

దుర్గామల్లేశ్వర కల్యాణోత్సవానికి విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు దుర్గాదేవికి, పరమేశ్వరుడికి కల్యాణం చేయనున్నారు. ఆలయ మహామండపంలోని ఏడో అంతస్థులో ఈ వేడుకకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పందిళ్లు, తలంబ్రాలు సిద్ధం చేశారు. సాయంత్రం స్వామివారిని నంది వాహనంపై నగరంలో ఊరేగిస్తారనీ... రాత్రి 8 గంటల నుంచి వేదపండితులు, కవులు రాయబారంలో పాల్గొంటారని ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. అనంతరం రాత్రి పదిన్నరకు కల్యాణ క్రతువు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ మహోత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details