మారుతున్న అవసరాలతో పాటు విద్య విధానం కూడా మారాలనే ఓ యువకుడి ఆలోచన... నూతన ఆవిష్కరణకు తెరతీసింది . అందుబాటులోకి వస్తున్న అధునాతన కోర్సుల్ని... స్థానిక భాషలో అందరికి చేరువ చేయాలనుకున్నాడు. ఇదే సమయంలో గురువులు, విద్యార్ధులను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేసి కోర్సు 'దునియా' పేరుతో ఓ వెబ్‌సైట్ రూపొందించాడు. ఆన్‌లైన్ కోర్సుల గురించి అవగాహన లేని వారికి సైతం అర్ధమయ్యేలా కొత్త కోర్సులు అందిస్తున్నాడు. ఉత్తమ భవిష్యత్తుకు బాసటగా నిలుస్తున్నాడు...విజయవాడకు చెందిన సాయిరమేష్
స్థానిక భాషలో ఆన్‌లైన్ కోర్సు 'దునియా' - Online courses in Vijayawada
అనుభవానికి మించిన పాఠం లేదని పెద్దలు చెప్తారు .. అదే నిజమైంది ..డిజిటల్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించేందుకు దేశ యాత్ర చేసిన విజయవాడవాసి తనకు ఎదురైన సమస్యలు పరిష్కరించాలనుకున్నాడు . ప్రాంతీయ భాషలో ఆన్ లైన్ కోర్సులను రూపొందించాలనుకున్నాడు. చేతిలో విద్య ఉండి నేర్పించాలనుకునే వారిని.. వాటిని నేర్చుకోవాలనుకునే వారిని ఒకేచోటకు చేర్చాడు. కోర్సుదునియా.కామ్ పేరుతో ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేశాడు.
స్థానిక భాషలో ఆన్‌లైన్ కోర్సు దునియా
Last Updated : Dec 29, 2020, 10:33 PM IST