తెదేపా హయాంలో.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్న అంబుల వైష్ణవి.. తన పుట్టిన రోజును వినూత్నంగా చేసుకుంది. కరోనా కట్టడి విధుల్లో ఉన్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది కాళ్లు కడిగి సన్మానించింది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ సామాజిక దూరం పాటించాలని.. చేతులను పదే పదే శుభ్రం చేసుకోవాలని.. శానిటైజర్లు వినియోగించాలని ఎస్సై మణికుమార్ పిలుపునిచ్చారు. తమకు సంఘీభావం తెలిపిన వైష్ణవిని అభినందించారు.
డాక్టర్లు, పోలీసుల కాళ్లు కడిగిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ - the birthday of amaravathi brand ambassador gratitute to police and sanitation workers
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా తెదేపా ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకున్న అంబుల వైష్ణవి... కరోనా పోరులో కీలకంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి సంఘీభావం తెలిపింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది కాళ్లు కడిగి సన్మానించింది.
పారిశుద్ధ్య కార్మికులు కాళ్లుకడిగిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్