అకాల వర్షానికి కృష్ణా జిల్లా మైలవరంలోని మార్కెట్ యార్డ్ ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన పంట ఇలా పనికి రాకుండా పోయిందని రైతన్నలు ఆందోళన చెందారు. స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్... రైతులకు భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యం అంతటిని త్వరితగతిన కొనుగోలు చేస్తామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మాధవీలతకు పరిస్థితిని వివరించామనిన్నారు. రైతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం.. ఆదుకుంటామన్న ఎమ్మెల్యే - latest news of mylavaram
కృష్ణా జిల్లా మైలవరంలో అకాల వర్షం.. అన్నదాతలకు ఆవేదన మిగిల్చింది. మార్కెట్ యార్డుకు తరలించిన ధాన్యం తడిసిపోయింది.

అకాల వర్షానికి తడిచిన ధాన్యం