ఆధార్ కార్డులు లేకపోవడంతో చాలామంది పేదలు, నిరక్షరాస్యులు, పెద్దలు, శిశువులు కొవిడ్ పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని, వైద్యసేవలు పొందలేకపోతున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి జగన్ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ పరీక్షలకు ఆధార్ తప్పనిసరని భారత వైద్య పరిశోధనా మండలి పేర్కొనడమే దీనికి కారణమని ట్విటర్ వేదికగా శనివారం ప్రస్తావించారు. ఇలాంటి కఠిన షరతులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, న్యాయస్థానాలు, ఆధార్ సీఈవో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.