కృష్ణా జిల్లా విజయవాడలోని 45వ డివిజన్లో కొండపైనున్న రిటైనింగ్ గోడ కూలిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి గోడ కూలి ఇళ్లపై పడటంతో ఇళ్లు శిథిలమయ్యాయి. దీనిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఇళ్ళను నిర్మించాలని సీపీఎం నగర కమిటీ సభ్యుడు మోహన్ రావు డిమాండ్ చేశారు.
గోడ కూలింది.... గూడు పోయింది - విజయవాడలో వర్షం కారణంగా కూలిన వాల్
విజయవాడ నగరంలోని 45వ డివిజన్లో వర్షానికి గోడ కూలి ఇళ్లపై పడటంతో ఇళ్లు శిథిలమయ్యాయి. అధికారులకు మొర పెట్టుకున్నా లాభం లేకపోయిందంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలో గోడ కూలడంతో ఇళ్లు కూలాయి