ఎండలో నడిచి తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు... కృష్ణా జిల్లా మైలవరంలోని దాతలు ఆదుకుంటున్నారు. సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించారు. మైలవరం పరిసర ప్రాంతాల్లోని 10 కిలోమీటర్ల పరిధిలోని వలస కార్మికులను గుర్తించి.... తమకు సమాచారం అందిస్తే.. వెంటనే వారికి మొబైల్ వ్యాన్ ద్వారా భోజనాన్ని అందిస్తామని సాయి సేవాదళ్ అధ్యక్షుడు బాలాజీ ప్రసాద్ తెలిపారు.
వలస కార్మికులకు అండగా దాతలు - కృష్ణా జిల్లాలో వలస కూలీల వార్తలు
లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. పేదలు, అభ్యాగులు, వలస కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ల కోసం దాతలు మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. కరోనా విపత్తు వేళ అభ్యాగులకు సాయపడుతున్నారు.
due to corona lockdown Distributing food to migrant workers at nailavaram in krishna