ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఇంటర్​ మూల్యాంకనం నిలిపివేత

గురువారం నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్​ మూల్యాంకనంపై కరోనా ప్రభావం పడింది. అధ్యాపకుల ఆరోగ్యం దృష్ట్యా దీనిని ఇంటర్​ బోర్డు నిలిపివేసింది.

inter valuation
inter valuation

By

Published : Mar 21, 2020, 12:02 AM IST

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంటర్​ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అధ్యాపకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని శనివారం నుంచి ఈనెల 31 వరకు నిలిపివేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. మూల్యాంకనం ఎప్పటి నుంచి చేపట్టాలనే విషయాన్ని ఈనెల 31 తర్వాత పరిశీలించి వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details