విజయవాడ నగరంలో ఇంటింటి సర్వే దాదాపుగా పూర్తయింది. వారం రోజులుగా భారీగా సర్వైలెన్స్ బృందాలు ప్రతి ఇంటికీ తిరిగి వివరాలు సేకరించాయి. ఈ వివరాలను క్రోడీకరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. వీటి ఆధారంగా తదుపరి దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం, అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించటం వంటి చర్యలు తీసుకోనున్నారు.
సేకరణలో తలెత్తిన ఇబ్బందులు
సమాచార సేకరణలో సిబ్బంది పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. చాలా మంది ప్రజలు తమ వాస్తవ ఆరోగ్య పరిస్థితులను వెల్లడించలేదన్నారు. జలుబు, దగ్గు ఉందని చెబితే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారన్న భయంతో చాలా మంది వాస్తవాలు చెప్పడం లేదన్న అనుమానం వ్యక్తం చేశారు.