కృష్ణాజిల్లా అవనిగడ్డలో కార్తీక మాసం సందర్భంగా పోలీస్, పంచాయతీ, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా మట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సముద్ర స్నానాలను రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలో కరోనా కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు చేయడానికి హంసలదీవి వద్దకు ఎవరు రావద్దని ఆయన చెప్పారు. ఎవరైన నిబంధనలు అతిక్రమిస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.
"సముద్ర స్నానానికి అనుమతి లేదు"
కార్తీక మాసం సందర్భంగా తన కార్యాలయం వద్ద పోలీస్, పంచాయతీ, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ..సముద్ర స్నానాలు రద్దు చేసినట్లు తెలిపారు.
మాట్లాడుతున్న డీఎస్పీ మాహబూబ్ బాషా