పలు దొంగతనాల్లో నిందితునిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు కృష్ణా జిల్లా నూజివీడులో డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. నూజివీడు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన దాసరి బాలు ప్రసాద్, అలియాస్ బాలు, అలియాస్ శ్రీనుపై పలు దొంగతనాలకు సంబంధించి అనేక పోలీస్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 16 కేసులలో 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 570 గ్రాముల వెండి ఆభరణాలు, 5 మోటార్ సైకిళ్లు, 8 చీరలు, కాపర్ వైరు, కేబుల్ వైరు చోరీలకు పాల్పడినట్లు వివరించారు. వీటి విలువ సుమారు 9,08,500 రూపాయల ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.