ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం హామీ అమలు కోసం డీఎస్సీ-98 అభ్యర్థుల ఆందోళన - విజయవాడ ధర్నా చౌక్ వద్ద డీఎస్సీ 98 లో అర్హత సాధించిన అభ్యర్థుల నిరసనలు

గత 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్న తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ.. విజయవాడ ధర్నా చౌక్ వద్ద డీఎస్సీ-98 క్వాలిఫైడ్ ఐక్య పోరాట వేదిక సభ్యులు నిరసన చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

dsc 98 protests
నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు

By

Published : Dec 12, 2020, 3:39 PM IST

అధికారంలోకి వస్తే అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ అమలు చేయాలంటూ.. డీఎస్సీ-98 క్వాలిఫైడ్ ఐక్య పోరాట వేదిక సభ్యులు ధర్నా చేపట్టారు. 'జగన్ అన్నపై నమ్మకం' పేరుతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు.

అభ్యర్థులకు న్యాయం జరిగేలా మండలిలో సమస్యను లేవనెత్తి పరిష్కరించేందుకు కృషి చేస్తామని.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. గత 15 ఏళ్లుగా డీఎస్సీ-98లో అర్హత సాధించిన అభ్యర్థులు పోరాడుతున్నారని.. ఇప్పటికైనా వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ఐక్య పోరాట వేదిక కన్వీనర్ శివప్రసాద్ కోరారు. ఎమ్మెల్సీ కమిటీ నివేదిక ప్రకారం.. సుమారు 4,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details