కృష్ణా జిల్లాలో డ్రై రన్ విజయవంతమైందని సంయుక్త కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు కన్పించలేదని వెల్లడించారు. కొ-విన్ పోర్టల్ పని తీరు బాగుందని అన్నారు. జిల్లాలోని ఐదు చోట్ల అధికారులు డ్రై రన్ సోమవారం నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేట పూర్ణా హార్ట్ ఇనిస్టిట్యూట్, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం-4, ప్రకాష్‌నగర్ పీహెచ్‌సీలలో ఈ ప్రక్రియను చేపట్టారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ... పోలింగ్ తరహాలో డ్రై రన్ చేపట్టామని పేర్కొన్నారు. దేశంలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ప్రక్రియ నిర్వహించినందున.. కేంద్రం చేసే సూచనలతో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తామని వివరించారు. టీకా డ్రైరన్‌కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గ దులను ఏర్పాటు చేశారు.