ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో యువకులు హల్​చల్..ముగ్గురిపై దాడి

మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించిన ఘటన కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరులో జరిగింది. మద్యం సేవించడానికి బెల్టు షాపుకు వచ్చిన విజయవాడకు చెందిన ఆరుగురు యువకులు స్థానిక యువకులపై దాడి చేసి గాయపరిచారు.

మద్యం మత్తులో యువకులు హల్​చల్
మద్యం మత్తులో యువకులు హల్​చల్

By

Published : Jun 26, 2020, 3:52 PM IST

కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరులో తాగిన మైకంలో యువకులు వీరంగం సృష్టించారు. గ్రామంలోని బెల్ట్ షాపులో మద్యం సేవించడానికి వచ్చిన విజయవాడకు చెందిన ఆరుగురు యువకులు.. ముగ్గురు స్థానిక యువకులతో ఘర్షణకు దిగి వారిని చితకబాదారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలిచారు. మరో ఇద్దరిని మైలవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

ఘటనకు కారకులైన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఇన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘర్షణకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details