ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రోజులుగా పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు - krishna

కృష్ణా జిల్లాలో పోలీసులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురు డ్రైవర్లు పట్టుబడ్డారు.

తనిఖీలు

By

Published : May 18, 2019, 4:24 PM IST

మూడురోజులుగా పోలీసుల వాహన తనిఖీలు

కృష్ణా జిల్లాలో మూడు రోజలుగా జరుపుతోన్న తనిఖీల్లో ట్రావెల్స్ డ్రైవర్ల మత్తు డ్రైవింగ్ వ్యవహారం బయటపడుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పట్టుబడగా. . .అతిగా మద్యం సేవించి బస్సు నడుపుతున్న మరో డ్రైవర్ ను శుక్రవారం రాత్రి రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద తనిఖీలు జరపగా. . . మద్యం సేవించి వాహనాలు నడుపుతోన్న ముగ్గురు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు . 40 మంది ప్రయాణికులతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్తోన్న ఓ ట్రావెల్స్ బస్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరో డ్రైవర్ తో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చిన తర్వాత బస్సును స్వాధీనం చేసుకున్నారు. అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతోన్న మరో ఇద్దరు లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశారు. యాజమాన్యంపై కేసులు నమోదు చేసి డ్రైవర్లను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details