ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే.. లైసెన్సులు రద్దు' - ఆరోగ్య ట్రస్ట్ సీఈవో వార్తలు

కరోనా నిర్థరణ పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డా.మల్లిఖార్జున హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులు, ప్రయోగశాలల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

drug-controller-on-corona-tests
ఆరోగ్య ట్రస్ట్ సీఈవో డా.మల్లిఖార్జున

By

Published : Sep 1, 2020, 3:13 PM IST

ప్రభుత్వ అనుమతి లేని ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డా. మల్లిఖార్జున హెచ్చరించారు. అనుమతి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరీక్షల నిర్వహణకు అనుమతి పొందిన ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు.

ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ర్యాపిడ్ టెస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన 750 రూపాయలను మాత్రమే వసూలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులు, ల్యాబుల లైసెన్సులు రద్దు చేస్తామని తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details