కృష్ణా జిల్లా గుడివాడలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. బైపాస్ రోడ్డులో ఓ ఆర్ఎంపీ వైద్యునికి చెందిన క్లినిక్‌లో సోదాలు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వచేసిన మందులను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన ఔషధాలను న్యాయస్థానానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అనధికారికంగా క్లినిక్ నిర్వహిస్తున్న సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
గుడివాడలో దాడులు... మందులు స్వాధీనం, ఒకరు అరెస్టు - గుడివాడ క్రైం న్యూస్
కృష్ణా జిల్లా గుడివాడలో ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గుడివాడలో దాడులు... మందులు స్వాధీనం, ఒకరు అరెస్టు