ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెబ్బతిన్న పైప్​లైన్: తాగునీటికి ఇబ్బందులు - drinking water supply in nandigama

కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన పైప్​లైన్​ దెబ్బతినటాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు.

damage of drinking water pipeline
పైప్​లైన్​కు మరమ్మత్తులు చేయిస్తున్న అధికారులు

By

Published : Nov 17, 2020, 8:45 PM IST

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో ఉన్న నందిగామ, హనుమంతుపాలెం, అనాసాగరం గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్నేరుపై కేసర్ వద్ద ఏర్పాటు చేసిన బోరు నుంచి రక్షిత మంచినీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్​లైన్​ పాడయ్యింది.

నీరు వృథాగా పోతూ.. అంబర్ పేట క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారి పక్కన చెరువులా మారింది. దీన్ని గుర్తించిన అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి వెంటనే మరమ్మతులు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details