Drinking Water Problem in Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రామీణ ప్రాంత వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎండాకాలం రాకముందే తాగు నీటి కోసం మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంటింటికీ కుళాయి ఇస్తామన్న వైసీపీ ప్రభుత్వ హమీ ఏమైందని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
People Facing Drinking Water Problem: జిల్లాలోని బందరు మండలం సుల్తా నగరంలో గుక్కెడు మంచినీటి కోసం స్థానికులు అల్లాడిపోతున్నారు. రెండు, మూడు రోజులకోసారి వచ్చే తాగునీటి కోసం మహిళలు పడిగాపులు కాస్తున్నారు. కుళాయి వద్ద వంతుల ప్రకారం బిందెలు ఏర్పాటు చేస్తున్నారు. అందినకాడికి నీళ్లను పట్టుకని దాచుకుంటున్నారు. బిందెలు, బక్కెట్లు, వాటర్ బాటిళ్లలో నీళ్లు నింపుకుంటున్నారు. ఏ కుళాయి వద్ద చూసినా ఖాళీ బిందెలే దర్శనమిస్తున్నాయి.
సీఎం జగన్ హామీలే తప్ప ఆచరణేదీ? - దాహమేస్తే ఆ గిరిజనులు ఆకాశం వైపు చూడాల్సిందే!
Water Crisis: తాగునీరు లేక తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు. నీటి కోసం ఎదురు చూస్తూ రోజూ వారి పనులకు సైతం వెళ్లటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు వచ్చే సమయంలో తాము ఇంటి వద్ద లేకపోతే రోజంతా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. పంపుల్లో నీరు అందకపోతే.. సమీపంలో ఉన్న బావుల్లో నీరు తాగుతున్నామని, దీని వల్ల రోగాల బారిన పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Drinking Water Problem: గత ప్రభుత్వ హయాంలో తమకు ఇళ్లలోకి నీటి పంపులు ఉండేవని మహిళలు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందిన వారి ఇంట్లో మాత్రమే ఉంచి మిగిలిన వారికి తీసేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కనీసం పేదలకు తాగునీరు కూడా అందించలేకుండా పోయిందని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు చొరవ తీసుకుని ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రామస్థుల నీటి కష్టాలు.. మట్టి తవ్వితేనే గొంతు తడిసేది..!
Public Facing Problems With Drinking Water: మచిలీపట్నం తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్యల దృష్ట్యా బందరు మండలానికి గతేడాది 205 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. రెండు గ్రామాలకు కలిపి ఒక సామూహిక రక్షిత నీటి పథకాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రక్షిత మంచి నీటి పథకాలకు అనుసందానంగా ఉన్న పైపు లైన్లను అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందులో ఒక్క పని చేపట్టలేదు. ఎప్పటికప్పుడు ఇదిగో టెండర్లు పిలుస్తున్నామని చెప్పడమే తప్ప ఆ ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు.
"తాగునీరు లేక మేము తీవ్ర అవస్థలు పడుతున్నాం. రెండు, మూడు రోజులకోసారి వచ్చే గుక్కెడు మంచినీటి కోసం.. పడిగాపులు కాస్తున్నాం. కుళాయి వద్ద వంతుల ప్రకారం బిందెలు ఏర్పాటు చేసి.. అందినకాడికి నీళ్లను పట్టుకుని దాచుకుంటున్నాం. నీటి కోసం ఎదురు చూస్తూ రోజూ వారి పనులకు సైతం వెళ్లటంలేదు. నీళ్లు వచ్చే సమయంలో ఇంటి వద్ద లేకపోతే రోజంతా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లలోకి నీటి పంపులు ఉండేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందిన వారి ఇంట్లో మాత్రమే ఉంచి మిగిలిన వారికి తీసేశారు." - స్థానికులు
Water Problem : పలు పట్టణాల్లో నీటి కొరత... దాహం తీరే దారేదీ?