కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో తాగునీటి కోసం పూర్వకాలం పెద్ద చెరువు ఏర్పాటు చేసుకున్నారు. ప్రకాశం బ్యారేజి ద్వారా వచ్చే నీళ్లను ఫిల్టర్ చేసి కుళాయిలకు ఎక్కించేవారు. ఈ క్రమంలో చెరువు దగ్గర నుంచి ట్యాంకుకు ఎక్కే పైప్ పాడైపోగా.. నీటి సమస్య తలెత్తింది.
అప్పటినుంచి తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్ లైన్ లీకులు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. తాగునీటికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.