ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలోని ఎస్వీఎస్నగర్ వాసులకు మురుగునీటి ప్రాంతాలు కంగారు పుట్టిస్తున్నాయి. సరైన డ్రైనేజీ లేక.. రోజువారీ వాడుక నీరు రోడ్లు పైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దోమలకు, పందులకు నివాసయోగ్యంగా ఆ కాలనీ తలపిస్తోంది. పారిశుద్ధ్యంపై అధికారులు చర్యలు తీసుకోవట్లేదని.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు వాలంటీర్లకు, పంచాయతీ అధికారులకు చెప్పిన కూడా పట్టించుకోట్లేదని వారు తెలిపారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
మైలవరంలో మురుగునీటి ఇబ్బందులు - మైలవరంలో మురుగునీటి వార్తలు
కరోనా కోరలు చాచుతున్న వేళ.. అన్ని జిల్లాల అధికార యంత్రాంగం పారిశుద్ధ్యంపై దృష్టిసారిస్తోంది. కానీ కృష్ణా జిల్లా మైలవరంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా మురుగునీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు.. సమస్య తెలిపినా వారు పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు.
మైలవరంలో మురుగునీటి ఇబ్బందులు