తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీలో ఈసారి ప్రవేశపెట్టిన రెండు కొత్త కోర్సుల్లో మొత్తం 13,720 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) కింద రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2020-21)లో 1,059 కళాశాలల్లో 4,24,315 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో బీఎస్సీ డేటా సైన్స్‌లో 6,780, బీకాం అనలిటిక్స్‌లో 6,940 సీట్లు కొత్తగా చేరాయి. డేటా సైన్స్‌ను 124 కళాశాలల్లో, బిజినెస్ అనలిటిక్స్‌ను 113 కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లోనే ఎక్కువగా ఈ కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. గత విద్యా సంవత్సరం దోస్త్ పరిధిలో 1,046 కళాశాలలు ఉండగా వాటిల్లో 4,12,805 సీట్లు ఉన్నాయి. కాగా 2.22 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి కళాశాలల సంఖ్య 1059కి పెరిగింది. సీట్ల సంఖ్య కూడా 4.24 లక్షలకు చేరుకుంది.
తెలంగాణలో దోస్త్ రిజిస్ట్రేషన్‌కు తుది గడువు - telangana dost registration updates
తెలంగాణలో డిగ్రీలో ఈ విద్యా సంవత్సరం(2020-21)లో ప్రవేశపెట్టిన బీఎస్సీ డేటా సైన్స్‌లో 6,780, బీకాం అనలిటిక్స్‌లో 6,940 సీట్లు కొత్తగా చేరాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సోమవారం, దరఖాస్తుల సమర్పణ, వెబ్ ఆప్షన్లకు మంగళవారం తుది గడువు అని దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.
![తెలంగాణలో దోస్త్ రిజిస్ట్రేషన్‌కు తుది గడువు DOST REGISTRATIONS LAST DAY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8705942-580-8705942-1599436706940.jpg)
తెలంగాణలో దోస్త్ రిజిస్ట్రేషన్‌కు తుది గడువు
ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,41,553 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 1.12 లక్షల మంది దరఖాస్తులు సమర్పించగా...వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నది 83,526 మంది మాత్రమే. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సోమవారం, దరఖాస్తుల సమర్పణ, వెబ్ ఆప్షన్లకు మంగళవారం తుది గడువు అని దోస్త్ కన్వీనర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులందరూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి:అధికార పార్టీకి చెందిన వ్యక్తులే సూత్రధారులు
Last Updated : Sep 7, 2020, 12:05 PM IST
TAGGED:
dost web options final date