కలకలం రేపిన ఇంటింటి సర్వే కృష్ణా జిల్లా పామర్రులో కొందరు యువకులు చేస్తున్న ఇంటింటి సర్వే కలకలం రేపింది. స్వావాట్ డిజిటల్ అనే కంపెనీ పేరుతో కొందరు యువకులు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. వారిపై అనుమానం వ్యక్తం చేసిన వైకాపా నియోజకవర్గ బాధ్యుడు కైలే అనిల్... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులువిచారణ చేశారు. సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎవరు నిర్వహించమన్నారన్న అంశాలపై ఆరా తీశారు.