Sankranti Kite Festival : సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసే పతంగుల వల్ల పక్షులకు, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా చూడాలని ప్రజలకు తెలంగాణ అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దామని పిలుపునిచ్చింది. కేంద్ర చట్టం ప్రకారం చైనా మాంజా వాడకాన్ని రాష్ట్రంలో నిషేధించినట్లు తెలిపింది. దాన్ని అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా అయిదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష దాకా జరిమానా విధిస్తారని, దాని వల్ల పక్షులకు హాని కలిగితే 3-7 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.10 వేల వరకు జరిమానా ఉందని హెచ్చరించింది.
ఈ సంక్రాంతికి.. పతంగులతో పాటు.. పక్షులనూ ఎగరనిద్దం - పతంగులతో పాటు పక్షులను ఎగరనిద్దాం
Sankranti Kite Festival : సంక్రాంతి పండుగకు మన ఆనందమే కాదు.. పక్షుల ఆనందాన్ని కూడా కోరుకుందాం. ఎందుకంటే చైనా మాంజాతో ఎగరవేసే పతంగుల వల్ల పక్షుల ప్రాణాలు పోతున్నాయి. పక్షులకు, పర్యావరణానికి నష్టం కలుగుకుండా ఈ సంవత్సరం పండగ చేసుకుందాం. అలాగే చైనా మాంజా ఉపయోగిస్తే.. కఠినమైన చర్యలు ఉంటాయని తెలంగాణ అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
Sankranti Kite Festival
చైనా మాంజాను రవాణా చేసే వాహనాల్ని సీజ్ చేస్తామని స్పష్టం చేసింది. చైనా మాంజాను అమ్మినట్లు తెలిస్తే అటవీశాఖ టోల్‌ఫ్రీ నంబర్లు 040-23231440, 18004255364లకు సమాచారం అందించాలని కోరింది. ‘‘పతంగులను ఎగరేసేందుకు కొందరు గ్లాస్ కోటింగ్‌తో కూడిన నైలాన్, సింథటిక్ దారాన్ని వాడుతున్నారు. అందులో చిక్కుకుని పక్షులు చనిపోతున్నాయి. మనుషులూ గాయపడుతున్నారు. చైనా మాంజా బదులు సంప్రదాయ దారం వాడండి’’ అని పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు.
ఇవీ చదవండి: