కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిధిలో ఏటీఎమ్లే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాటూరి వెంకటేశ్ నుంచి 25 వేల 200 రూపాయలు ... ప్రకాశం జిల్లా కొల్లపూడి వాసి సూరగాని సీతారామయ్య వద్ద 25 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు తెలిపారు. నాగాయలంక, చల్లపల్లి, మచిలీపట్నం పరిధిలో నమోదైన అనేక కేసుల్లో నిందితులు ముద్దాయిలుగా ఉన్నారని వివరించారు.
పోలీసులకు చిక్కిన ఏటీఎమ్ దొంగలు - case
అవనిగడ్డ పరిధిలో ఏటీఎమ్‌లో చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దొంగల అరెస్టు