వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు నామ పత్రాలు అందచేశారు. డొక్కా నామినేషన్‌ను సమర్ధిచేందుకు వైకాపా నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకర్‌రావు, ఉండవల్లి శ్రీదేవి, జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు.
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ - ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు 2020 వార్తలు
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్‌ను సమర్థించేందుకు వైకాపా నేతలు హాజరయ్యారు. తెదేపాతో సహా మిగతా పార్టీ అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో తెదేపా పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా చేసి.. సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు.
ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు ఇవాళ తుదిగడువు కావటంతో డొక్కా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. తెదేపాతో సహా ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరూ నామినేషన్ వేయకపోవటంతో మాణిక్యవరప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఇవీ చదవండి...: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ ఎలా ఇస్తారు: రఘురామకృష్ణరాజు