కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్లపాడులో పిచ్చికుక్కలు సైరవిహారం చేశాయి. 10మందిపై దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పెద్దలు, నలుగురు చిన్న పిల్లలకు గాయాలయ్యాయి. వీరంతా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెచ్చిపోతున్న కుక్కలు..బయటకు వెళ్లాలంటేనే.. - Wandering dogs in Nandigama
గ్రామాలలో శునకాలు రెచ్చిపోతున్నాయి.. ఎప్పుడు ఎలా దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. కుక్కల బెడద నుంచి రక్షించాలని అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బయటకు వెళ్లాలంటే ఎక్కడ నుంచి కుక్కలు వచ్చి కరుస్తాయోనని భయంగా ఉందని ప్రజలంటున్నారు.
పిచ్చికుక్కలు
గ్రామంలో శునకాలను అదుపు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరతున్నారు.
ఇదీ చదవండీ..INTER: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు