ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

dog death annivarsary: శునకానికి విగ్రహం.. ఐదేళ్లుగా వర్ధంతి కార్యక్రమాలు - అంపుపురంలో శునకానికి వర్ధంతి

పెంపుడు జంతువులంటే ప్రాణమని, అవి కూడా తమ కుటుంబంలో భాగమని చాలామంది భావిస్తుంటారు. అవి చనిపోతే రెండు మూడు రోజులు బాధపడి వదిలేస్తాం ఇదంతా మాములే.. కానీ ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క చనిపోతే ఐదేళ్లుగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కృష్ణా జిల్లాలో ఐదేళ్ల క్రితం చనిపోయిన శునకానికి వర్ధంతి నిర్వహిస్తూ.. దాని పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటున్నాడు.

dog  death annivarsary in ampapuram krishna district
dog death annivarsary in ampapuram krishna district

By

Published : Jul 22, 2021, 4:27 PM IST

Updated : Jul 22, 2021, 6:31 PM IST

శునకాలు విశ్వాసానికి ప్రతి రూపాలని అంటారు. జంతు ప్రేమికులు చాలామంది శునకాలను ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పెంచుకుంటూ ఉంటారు. అవి అనారోగ్యంతో మరణించిన ప్రమాదవశాత్తు మరణించిన తమ కుటుంబలోని వ్యక్తిని కోల్పోయిన విధంగా బాధపడుతుంటారు. కానీ కొన్ని రోజులకు మర్చిపోవాల్సిందేగా..

శునకానికి విగ్రహం.. ఐదేళ్లుగా వర్ధంతి కార్యక్రమం

కానీ కృష్ణ జిల్లా బాపులపాడు మండలం అంపపురానికి చెందిన రైతు ఐన సుంకర జ్ఞాన ప్రకాష్ మాత్రం ఆ శునకం చనిపోయి 5 ఏళ్లు గడుస్తున్నా దానిని మరిచిపోలేకపోతున్నాడు. మనుషులకు నిర్వహిచే విధంగా వర్ధంతులు కూడా నిర్వహిస్తున్నారు. శునకం చనిపోయి ఐదు ఏళ్లు గడిచిన సందర్భంగా ఇవాళ 5వ వర్ధంతిని నిర్వహించారు. ఊర్లోని వారికి భోజనాలు కూడా పెట్టారు. ఇద్దరు కూతుళ్లకి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ కుక్కని ప్రేమతో పెంచుకున్నామని, అనారోగ్యంతో చనిపోవడంతో ఏటా జూలై 22న వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:javahar: 'పేదల కన్నీటి ప్రవాహంలో.. వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది'

Last Updated : Jul 22, 2021, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details