నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫాం వద్ద రోడ్డు ప్రమాదంలో కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లింది. గాయపడి చనిపోయిన కుక్క పిల్ల వద్ద దాని తల్లి దీనంగా చూస్తోంది. ఆ తల్లి హృదయం తల్లడిల్లిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. నోరులేని మూగ జీవి చాటుతున్న ప్రేమ అయినా చూసి మనుషుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.
మూగ మనసే మిన్న.... - మూగ మనసే మిన్న....
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తన పిల్లలు చనిపోవటం వల్ల తల్లికుక్క రోడ్డు పక్కనే కూర్చొని దీనంగా చూస్తోంది. కన్నపేగు ప్రేమను చాటుతోంది.
![మూగ మనసే మిన్న....](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4903767-906-4903767-1572371775479.jpg)
బిడ్డ మృతి వద్ద దీనంగా కూర్చున తల్లికుక్క