ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శునకానికి పిండ ప్రదానం - bapulapadu mandal

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సూర్యప్రకాష్​ రావు అనే రైతు తన కుక్క మీద మమకారాన్ని చాటాడు. 9 ఏళ్లు తనతో మెలిగిన తన అంజి(కుక్క) మరణించి మూడు సంవత్సరాలు అయ్యింది. కన్న కొడుకు వలె ప్రతీ ఏటా దినకర్మ చేసి తన ప్రేమను చాటుకుంటున్నాడు ఆ యజమాని

శునకానికి పిండ ప్రదానం

By

Published : Jul 23, 2019, 10:23 AM IST

తమతో పాటు కుటుంబ సభ్యుడిగా మెలిగిన తన శునకం చనిపోయి మూడు సంవత్సరాలైనా యజమాని దాని మీద ఉన్న ప్రేమను మరవలేదు. ప్రతి ఏడాది ఇదే రోజు శునకానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ దానిపై ఉన్న మమకారాన్ని వీడలేదు. పిండ ప్రదానం, దిన కర్మలు నిర్వహించి చనిపోయిన తన శునకంపై అభిమానాన్ని చాటుకున్నాడు ఈ రైతు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ రావు అనే రైతు 9 సంవత్సరాల క్రితం ఒక చిన్న కుక్క పిల్లను తీసుకొచ్చి పెంచుకున్నాడు. ఆ శునకానికి అంజి అని నామకరణం చేసి తనకు మగ పిల్లలు లేని లోటుని తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ శునకం మనిషిలా తనతో 9 ఏళ్లు మెలిగింది. తర్వాత అనారోగ్యంతో మరణించింది. దానిపై ఉన్న మమకారాన్ని చంపుకోలేని ఆ రైతు... మనుషుల వలె దినకర్మ నిర్వహించాడు. ఇక అప్పటినుంచి ప్రతీ ఏటా సంవత్సరీకం జరుపుతున్నాడు. ప్రస్తుతం ఆ శునకం మరణించి మూడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా దినకర్మలు జరిపాడు. కన్న కొడుకులా దీనిని పెంచామని చనిపోయి 3 ఏళ్లు గడిచినా మరవలేక పోతున్నాం అని యజమాని తెలిపాడు.

శునకానికి పిండ ప్రదానం

ABOUT THE AUTHOR

...view details