ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో పిచ్చి కుక్క దాడి... 15 మందికి గాయాలు - నందిగామలో పిచ్చి కుక్క దాడి...15 మందికి గాయాలు

కృష్ణా జిల్లా నందిగామలో 15 మందిపై పిచ్చికుక్క దాడి చేసింది. బాధితులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ అధికారుల స్పందించి తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

dog attack in Nandigama  15 members injured
నందిగామలో పిచ్చి కుక్క దాడి...15 మందికి గాయాలు

By

Published : Aug 16, 2020, 3:31 PM IST

కృష్ణా జిల్లా నందిగామలోని రామన్నపేట, చిన్నమసీదు, ఎంజీహెచ్ పాఠశాల ప్రాంతాల్లో 15 మంది పై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో పలువురు మహిళలతోపాటు మంది కొందరికి గాయాలయ్యాయి. వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయని ఎన్ని ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details