వైద్యుల ఆందోళన తీవ్రం.. రాష్ట్రవ్యాప్తంగా సేవలు బంద్ - doctors
జూనియర్ డాక్టర్ల ఆందోళన తీవ్రమైంది. భారతీయ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుతో.. ఇతర డాక్టర్లూ వారికి జత కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపేశారు.
doctors-strike-for-nmc-bill
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన మరింత ఉధృతంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఐఎంఏ పిలుపుతో వైద్యులు చికిత్సను నిలిపివేశారు. అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలు నిలిపివేశారు డాక్టర్లు. తమ డిమాండ్ పై స్పష్టమైన హామీ ఇస్తేనే.. ఆందోళన విరమిస్తామని జూనియర్ డాక్టర్లు, వారికి మద్దతుగా నిలుస్తున్న ఇతర వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
Last Updated : Aug 8, 2019, 10:39 AM IST