ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

6 నెలలకే ప్రసవం.. 500 గ్రాములతోనే బిడ్డ జననం! - కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా సిద్ధార్థ వైద్య కళాశాల ఆసుపత్రిలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఐదు వందల గ్రాముల బరువు ఉన్న శిశివుకు ప్రాణం పోశారు అక్కడి వైద్యులు.

ఐదు వందల గ్రాముల బరువుతో పుట్టిన శిశువును కాపాడిన వైద్యులు

By

Published : Sep 5, 2019, 5:15 PM IST

ఐదు వందల గ్రాముల బరువుతో పుట్టిన శిశువును కాపాడిన వైద్యులు

కృష్ణా జిల్లా గన్నవరం చిన్న అవుటపల్లి వద్ద ఉన్న పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో.. ఆరో నెలకే ఓ శిశువు జన్మించింది. అదీ.. కేవలం ఐదు వందల గ్రాముల బరువుతోనే. ఈ బిడ్డకు ప్రాణం పోసిన వైద్యులు.. ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ప్రాణాన్ని నిలబెట్టారు. వెంటిలేటర్ సాయంతో ఇరవై రోజుల నుంచి ఆ పసిపాపకు వైద్యం అందిస్తున్నారు. వైజాగ్ వైద్య కళాశాలకు చెందిన చిన్నపిల్లల నిపుణుడు డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇలాంటి శిశివు బతకటం కష్టమనీ, ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమైంది అని డాక్టర్ రమేష్ బాబు చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ గర్భిణికి అనారోగ్యంగా ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో శిశివును బయటకు తీసినట్లు ఆయన తెలిపారు. ఐదు వందల గ్రాములతో పుట్టిన ఈ శిశువు ప్రస్తుతం ఐదు వందల అరవై గ్రాముల బరువుకు వచ్చిందనీ, ఆరోగ్యం బాగానే ఉందనీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details