ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర ఆస్పత్రిలో.. అరుదైన శస్త్రచికిత్స - rare surgery for heart news

ప్రపంచంలోనే క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో నిర్వహించినట్లు డాక్టర్ పి.వి.రామారావు వైద్య బృందం తెలిపింది. అరుదైన గుండె వ్యాధితో బాధపడుతున్న బాల కిశ్వత్‌ అనే ఎనిమిది నెలల బాలుడికి.. ఆపరేషన్​ చేసి ప్రాణాలు కాపాడామన్నారు.

rare surgery
అరుదైన శస్త్రచికిత్స

By

Published : Jan 28, 2021, 12:13 PM IST

విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో గుండెకు సంబంధించి అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించినట్లు డాక్టర్ పి.వి. రామారావు వైద్య బృందం తెలిపింది. బాల కిశ్వత్‌ అనే ఎనిమిది నెలల బాలుడు క్లిష్టమైన గుండెవ్యాధితో బాధపడుతున్నాడని... 5 లక్షల మంది శిశువులలో ఒకరికి వచ్చే అరుదైన ఈ వ్యాధి.. ఇప్పటివరకు ప్రపంచంలో 130మంది లోనే గుర్తించినట్లు వివరాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ఆరోగ్యశ్రీ, ఆంధ్ర హాస్పిటల్స్‌ మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయంతో బాలుడికి ఆపరేషన్​ చేసినట్లు ఆస్పత్రి చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ సర్వీసెస్ డైరక్టర్‌ చెప్పారు. ఈ శిశువుకు గుండె ఎడమ పక్క పెద్దగా ఉండటం, కుడి పక్క గుండె భాగాల నుంచి రక్తం.. ఊపిరితిత్తులకు వెళ్లే దగ్గర అడుపడుతుండడం వంటి లక్షణాల కారణంగా.. గుండె పరిమాణం పెరుగుతుండేదని చెప్పారు. కష్టతరమైన ఈ పరిస్థితులను అధిగమించి.. టీం వర్క్​తో శస్త్రచికిత్సను సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేశామని సర్జన్‌ డాక్టర్‌ దిలీప్‌ చెప్పారు.

గుండె సమస్యతో పుట్టిన తన కుమారుడిని బతికించుకోటానికి ఎన్నో ఆసుపత్రులు తిరిగామని బాలుడి తల్లి కన్నీరు పెట్టుకుంది. చివరకు ఆంధ్ర హాస్పిటల్​ యాజమాన్యం తమ బిడ్డ ప్రాణాలను కాపాడిందని చెప్పారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సలకు.. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తే.. ఎంతో మంది తల్లులకు కడుపుశోకం తప్పుతుందని వైద్యులు చెప్పారు.

ఇదీ చదవండి:

అవిభక్త కవలలకు అరుదైన శస్త్రచికిత్స

ABOUT THE AUTHOR

...view details