తాత్కాలిక ప్రాతిపదికన వైద్యుల నియామకంపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా కేసులు ఎక్కువ రావడం.. అందుకు తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ.70 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే 6 నెలలపాటు వారి సేవల్ని వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొవిడ్ ఆస్పత్రుల్లో.. వైద్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ - కొవిడ్ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అయితే తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
doctors-appointment
TAGGED:
ఏపీ కొవిడ్ ఆస్పత్రులు