చికిత్స నిమిత్తం వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ వైద్యుడిపై కృష్ణా జిల్లాలో కేసు నమోదు అయింది. మొవ్వ పీహెచ్సీలో పనిచేసే వైద్యుడు సొంటి శివరామకృష్ణ కంకిపాడు మండలం ఈడుపుగల్లు పరిధిలోని గోసాల కూడలిలో నివసిస్తూ స్థానికంగా వైద్యశాల నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీన ఓ మహిళ శివరామకృష్ణ వైద్యశాలకు వచ్చారు. ఆమెతో మాటలు కలిపిన శివరామకృష్ణ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పగా రెండో తేదీ రాత్రి శివరామకృష్ణ నిలదీశారు. అతను సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ ప్రభుత్వ వైద్యుడు కామాంధుడిగా మారాడు.. వైద్యానికి వచ్చిన మహిళతో..! - కృష్ణా జిల్లాలో మహిళకు వైద్యుడి వేధింపులు న్యూస్
తన దగ్గరకు వచ్చిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్ కామాంధుడిగా మారాడు. వైద్యం కోసం వచ్చి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ ప్రభుత్వ వైద్యుడు కామాంధుడిగా మారాడు.. వైద్యానికి వచ్చిన మహిళతో..!
Last Updated : Mar 3, 2021, 9:04 PM IST