తరతరాలుగా ఎలాంటి వీలునామా రాయకుండానే సంక్రమించిన ఆస్తి తెలుగు పద్యమని... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తెలుగు భాషలోని మాధుర్యం మాటల్లో చెప్పలేనిదని వర్ణించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో పద్యవైభవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంగ్లభాష మోజులో పడి నేటి తరం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాథమిక బోధన మాతృభాషలోనే ఉండాలని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచమంతా గుర్తిస్తే.... తెలుగు వాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల మాధ్యమంపై మోజు పెంచుకోవటమే ప్రస్తుత పరిణామాలకు కారణమని స్పష్టం చేశారు. మాతృభాషపై ప్రేమ పెంచుకోవాలంటే... ఇతర భాషలు వద్దనే అర్థం కాదని వెల్లడించారు. పరాయి భాషలు నేర్చుకుంటూనే మాతృభాషను ప్రేమించాలని సూచించారు.