ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు నిధులను ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించడాన్ని ఖండించారు ఏపీ కార్పెంటర్స్ అసోసియేషన్ 13 జిల్లాల నాయకులు. కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా సంక్షేమ బోర్డు నిధులను ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ పాలసీల వలన నిర్మాణ రంగం కుదేలైపోయిందని విమర్శించారు. కరోనా ప్రభావంతో కార్మికులు మరింతగా కష్టాల్లో కూరుకుపోయారన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన 40 రకాల వృత్తిదారులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు.లాక్ డౌన్ కాలానికి ప్రతి కార్మికునికి నెలకు 10 వేల ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇతర శాఖలకు మళ్లించొద్దు' - Do not divert building welfare board funds to other branches
ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు నిధులను ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించడాన్ని ఖండించారు ఏపీ కార్పెంటర్స్ అసోసియేషన్ 13 జిల్లాల నాయకులు. ఇసుక పాలసీ, మూడు రాజధానుల ప్రకటనతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి లక్షలాది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు.
భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇతర శాఖలకు మళ్లించొద్దు