పోలీసులు.. అధికార పార్టీ ఫిర్యాదుల పట్ల ఒకలా, ప్రతిపక్షాల పట్ల మరోలా పక్షపాత ధోరణి కనబరుస్తున్నారని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. న్యాయ నిపుణులతో చర్చించి వర్ల రామయ్య ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెదిరింపు కాల్స్ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు.
'బుద్ధి చెప్పాల్సిన బాధ్యత లేదా'
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టినవారిపై ఏ న్యాయ నిపుణులను సంప్రదించి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకి గుడ్డిగా నోటీసులివ్వమని ఏ న్యాయకోవిదుడు చెప్పారని మండిపడ్డారు. పోలీసులను బహిరంగంగా దూషించిన అధికార పార్టీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక శక్తులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత డీజీపీకి లేదా అని నిలదీశారు.
ఇవీ చూడండి : విశాఖ నగరంలో అరణ్యం.. అందులోనూ ఓ రహస్య గ్రామం..!