కృష్ణా జిల్లా నందిగామలో దీపావళి సంబంధిత సామగ్రి విక్రయాలు కళతప్పాయి. గతేడాది 25 బాణాసంచా విక్రయ దుకాణాలు ఉండగా ఈ సారి కేవలం ఆరు మాత్రమే ఏర్పాటుచేశారు. టపాసులు, పువ్వులు, తదితర పండగ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో వ్యాపారాలు దిగాలు పడ్డాయి.
అకాల వర్షాలతో రైతుల చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం పండగ చేసుకోవడానికి వెనకాడుతున్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి, ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు ప్రజల్లో పండగ వాతావరణం లేకుండా చేశాయి. ఫలితంగా విక్రయాలపై ప్రభావం పడుతోంది.