విజయవాడలోని బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించటంతోపాటు శాస్త్రీయ థృక్పదం పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిణి రాజ్యలక్ష్మి తెలిపారు. సైన్స్ , సమాజం అనే ప్రధానాంశంతో ఈ పోటీలు నిర్వహించామన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పచ్చదనం మెుదలైన అంశాలపై విద్యార్థులు నాటకాలను ప్రదర్శించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని విద్యాశాఖ అధికారిణి తెలిపారు.
విజయవాడలో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు - జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించటంతోపాటు శాస్త్రీయ థృక్పదం పెంచేందుకు విజయవాడలో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించారు. బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు
ఇదీచదవండి