ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్​ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత లేకుండా 24గంటలు పర్యవేక్షిస్తున్నాం' - oxygen supply in covid hospitals news

కృష్ణా జిల్లాలోని కొవిడ్​ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరాపై నిత్యం పర్యవేక్షిస్తున్నామని జిల్లా నోడల్​ అధికారి ఎల్.శివశంకర్ అన్నారు. ఆస్పత్రులకు ఆక్సిజన్​ అందించటంలోని సమస్యలను గుర్తించి.. ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆక్సిజన్​ సిలిండర్లను నల్లబజారుకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

district covid nodal officer
జిల్లా కొవిడ్​ నోడల్​ అధికారి

By

Published : May 8, 2021, 10:24 PM IST

కృష్ణాజిల్లాలో కొవిడ్​ బాధితులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత లేకుండా 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నామని జిల్లా కొవిడ్ నోడల్ ఆఫీసర్ జేసీ ఎల్.శివశంకర్ అన్నారు. ప్రత్యేక ఆక్సిజన్​ మానిటరింగ్ సెల్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆక్సిజన్​ సరఫరా, వినియోగం తదితర అంశాలపై సంబంధింత అధికారులతో సమీక్షించారు. అనంతరం విజయవాడలోని గ్యాస్ ఏజెన్సీ ఫిల్లింగ్ పాయింట్​ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నెల 4,5 తేదీల్లో కొవిడ్​ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరాలో సమస్య తలెత్తిందని.. సకాలంలో చర్యలు తీసుకోవటం వల్ల ఇబ్బందులు అధిగమించామని చెప్పారు.

రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక వాహనాలతో గ్రీన్ ఛానెల్ ద్వారా ఆక్సిజన్​ సిలిండర్లను తీసుకువస్తున్నామని జేసీ తెలిపారు. విశాఖ స్టీల్​ ప్లాంటు నుంచి అందాల్సిన ఆక్సిజన్​ సాంకేతిక సమస్యల కారణంగా ఆగిపోతే.. ప్రైవేటు కంపెనీ నుంచి 20 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఆస్పత్రులకు సరఫరా చేశామన్నారు. ప్రాణవాయువు సరఫరా ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అర్ధరాత్రి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడలో సెంట్రలైజ్డ్ఆక్సిజన్​ యూనిట్​ను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఆక్సిజన్​ సిలిండర్లకు కృత్రిమ కొరత సృష్టించి.. నల్ల బజారుకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ శివశంకర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించాలి: బొత్స

ABOUT THE AUTHOR

...view details