అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్ నెస్ - ఆసరా సంస్థ ద్వారా ప్రతి వినియోగదారుడు సొంతంగా కేసును వాదించుకునేందుకు అవగాహన కల్పిస్తున్నామని కృష్ణా జిల్లా న్యాయవాదులు, ఆసరా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఇగ్బాల్ చెప్పారు. విజయవాడ కమిషనర్ కార్యాలయంలో ఆసరా అవగాహన వాహనాన్ని జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి మాధవరావు, డీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి ప్రారంభించారు. నూతన వినియోగదారుల హక్కుల చట్టం - 2019 గురించి ప్రతి ఒక్క వినియోగదారుడు తెలుసుకోవాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు అవగాహన ఎంతో అవసరమని న్యాయమూర్తి మాధవరావు అన్నారు. కొవిడ్ సమయంలో అధికంగా ఫీజలు వసూలు చేసే వారిపై న్యాయపోరాటం చేసేందుకు ఆసరా సభ్యులు కూడా సహాయం చేస్తారని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల కోర్టులో సొంతంగా కేసును వేసి వాదించుకోవచ్చని ఆసరా ఏపీ అధ్యక్షుడు మహమ్మద్ ఇగ్బాల్ అన్నారు. అధిక ధరలు, నాణ్యమైన వస్తువులు పొందే హక్కు వినియోగదారుడికి ఉందని స్పష్టం చేశారు.
ఆసరా అవగాహన వాహనాన్ని ప్రారంభించిన న్యాయమూర్తి మాధవరావు - Judge Madhava Rao inaugurated the Asara awareness vehicle
అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్ నెస్ - ఆసరా సంస్థ ద్వారా ప్రతి వినియోగదారుడు సొంతంగా కేసును వాదించుకునేందుకు అవగాహన కల్పిస్తున్నామని కృష్ణా జిల్లా న్యాయవాదులు, ఆసరా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఇగ్బాల్ చెప్పారు. వినియోగదారుల కోర్టులో సొంతంగా కేసును వేసి వాదించుకోవచ్చని ఆయన తెలిపారు.
అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్ నెస్