విజయవాడ పాయకాపురం రైతు బజార్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్లాస్టిక్‌ను వదిలేసి కాగితం, నార సంచులను వినియోగించేలా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామని.. దీనిపై ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చిందనేది తెలుసుకునేందుకే ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం సమీపంలోని వార్డు సచివాలయానికి వెళ్లి ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు తనకు పెన్షన్ రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పింఛన్ వచ్చేలా ఆదేశం.. బామ్మ కళ్లల్లో ఆనందం.. - all district collecters
కృష్ణా జిల్లా పాయకాపురంలో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. రైతుబజార్, వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓ వృద్ధురాలు తనకు పింఛను రావడం లేదని ఆయన దృష్టికి తీసుకురాగా.. వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పింఛన్ వచ్చేలా ఆదేశం.. బామ్మ కళ్లల్లో ఆనందం..
విజయవాడ పాయకాపురంలో జిల్లా కలెక్టర్ తనిఖీలు