విజయవాడ కేదారేశ్వరపేట మున్సిపల్ పాఠశాలలో మత్స్యకారులకు అవసరమైన చేపల వలలు, ఇతర సామగ్రిని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పంపిణీ చేశారు. మురళి ఫౌండేషన్, కేర్ అండ్ షేర్ స్వచ్ఛంద సంస్ధ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు యానాదులు, చెంచు సామాజిక వర్గాల వారి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలుపరుస్తోందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారు ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విజయవాడలో మత్స్యకారులకు వలలు, సామగ్రి పంపిణీ - కృష్ణా జిల్లా కలెక్టర్ నేటి వార్తలు
విజయవాడలో మత్స్యకారులకు అవసరమైన సామగ్రిని కృష్ణా జిల్లా కలెక్టర్ అందించారు. జాలర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విజయవాడలో మత్స్యకారులకు వలలు, సామగ్రి పంపిణీ