గిరిపుత్రులకు పాసు పుస్తకాలను ప్రభుత్వం అందించడం ఎంతో ఆనందంగా ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ఎండీ ఇంతియాజ్ అన్నారు. నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైలవరం, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులైన 82 గిరిజన కుటుంబాలకు భూ హక్కు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అన్ని దశలలో విస్తృత పరిశీలనల అనంతరం లబ్ధిదారుల ఎంపిక చేశామని కలెక్టర్ అన్నారు. మిగిలిన లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వ ఆదేశానుసారం అర్హులైన లబ్ధిదారులకీ పాసు పుస్తకాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు లోక్‌సభ సభ్యుడు కోటగిరి శ్రీధర్, నూజివీడు, మైలవరం శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, వసంత వెంకట కృష్ణ ప్రసాదు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవి లత, నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్ పాల్గొన్నారు.
నూజివీడులో గిరిజనులకు భూమి హక్కు పాసు పుస్తకాలు పంపిణీ - land passbook distribution in Noojeedu
కృష్ణా జిల్లా నూజివీడులో గిరిజనులకు భూమి హక్కుల పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. 82మందికి ఈ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు లోక్‌సభ సభ్యుడు కోటగిరి శ్రీధర్, నూజివీడు, మైలవరం శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌లు పాల్గొన్నారు.
నూజివీడులో గిరిజనులకు భూమి హక్కుల పాసుపుస్తకాలు పంపిణీ
ముఖ్యమంత్రి జగన్ బడుగుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థిక వెనకబాటు కలిగిన కుటుంబాలకు సీఎం భరోసా కల్పిస్తున్నారని అన్నారు.
TAGGED:
నూజివీడు తాజా వార్తలు