కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ టౌన్షిప్ హాల్లో వైఎస్ఆర్ గృహా వసతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు సామినేని ఉదయభాను నియామక పత్రాలను పంపిణీ చేశారు. పాదయాత్ర సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలను తీర్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మాయమాటలు చెప్పి ఓట్లు గెలవటం తప్ప.. తెదేపా చేసిందేమి లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.
టిడ్కో గృహాల లబ్ధిదారులకు నియామక పత్రాల పంపిణీ - tidco homes papers distribution news
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ వసతి గృహ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టిడ్కో గృహాల లబ్ధిదారులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు.
వైఎస్సాఆర్ గృహావసతి కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే