ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో పోలీసులకు పండ్ల పంపిణీ - people problems with lockdown

కరోనా వ్యాప్తి నివారణలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులకు పలువురు సహాయం చేస్తున్నారు. విజయవాడకు చెందిన భాజపా నేత పోలీసులకు పండ్లు పంపిణీ చేశారు.

Distribution of fruits to Vijayawada police
విజయవాడలో పోలీసులకు పండ్లు పంపిణీ

By

Published : Apr 1, 2020, 6:10 PM IST

విజయవాడలో పోలీసులకు పండ్ల పంపిణీ

కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తమ విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎండలనుసైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న వీరికి పలువురు ఆహారం, మజ్జిగ అందిస్తున్నారు. విజయవాడ నగరానికి చెందిన భాజపా నేత పాతూరి నాగభూషణం పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని బెంజిసర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు 2 టన్నుల పుచ్చకాయలు, కర్బూజ పండ్లను అందించారు. ప్రజలందరూ లాక్​డౌన్​ను తప్పనిసరిగా పాటించి, ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details