కృష్ణా జిల్లా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో.. నెలరోజులుగా లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, నిరుపేదలకు అహారాన్ని అందిస్తున్నారు. రైల్వేశాఖ సమన్వయంతో విజయవాడ వద్ద శ్రామిక్రైళ్లలో తరలివెళ్తున్న వారికి 3 రోజుల నుంచి చపాతీలు, తాగునీరు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు.
జాతీయ రహదారి మీదుగా తమ స్వస్థలాలకు వెళ్తున్న వారికి బెంజి సర్కిల్, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అమృత కలశం పేరిట నిరుపేదలకు నెలరోజులకు సరిపడా పప్పులు, బియ్యం ఇతర నిత్యావసరాలు అందిస్తున్నామని సేవా సమితి విజయవాడ ప్రతినిధి సాయివిశ్వనాథం తెలిపారు.